ఆ రైల్వేస్టేషన్‌కు ఏడాదికి రెండు రైళ్లే.. ఎక్కడంటే?

ఆ రైల్వేస్టేషన్‌కు ఏడాదికి రెండు రైళ్లే.. ఎక్కడంటే?

పంజాబ్‌ ఫిరోజ్‌పుర్-హుస్సేనీవాలా సరిహద్దులోని హుస్సేనీవాలా రైల్వేస్టేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్‌లో ఏడాదికి కేవలం 2 రోజులు మాత్రమే రైలు వచ్చే ఏకైక స్టేషన్ ఇది. మార్చి 23న భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా, ఏప్రిల్ 13న వైశాఖి పండుగ వేళ మాత్రమే ఇక్కడ రైళ్లు నడుస్తాయి. మిగిలిన రోజుల్లో ఈ రైల్వే ట్రాక్‌ను స్థానికులు రోడ్డు మార్గంగా ఉపయోగిస్తుంటారు.