నేడు సారవలో అన్నదాత సుఖీభవ
W.G: నరసాపురం మండలం సారవ గ్రామంలో ఈరోజు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ ఏడీఏ ప్రసాద్ తెలిపారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 11967 మంది రైతులు ఉన్నారన్నారు. వీరికి రూ. 7.63 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు పాల్గొంటారన్నారు.