సునీల్ నరైన్ సరికొత్త రికార్డు
IPL-2026లో భాగంగా MIతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో KKR ప్లేయర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో IPL చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు(190) ఆడిన విదేశీ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో పోలార్డ్‌ను(189) అధిగమించాడు. అలాగే నరైన్ తన IPL కెరీర్‌లో ఆడిన 190 మ్యాచ్‌లు KKR తరఫునే ఆడటం మరో విశేషం.