గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి: మంత్రి
JGL: 2027 గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు సూచించారు. సెక్రటేరియట్‌లో జరిగిన “గోదావరి పుష్కరాలు-2027” కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశంలో ఏర్పాట్లపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, గోదావరి పరివాహక ప్రాంతాలకు లక్షలాది భక్తులు వచ్చే అవకాశముందని మంత్రి తెలిపారు.