VIDEO: ఎడ్ల బండిని నడిపిన ఎమ్మెల్యే
ELR: చింతలపూడి మార్కెట్ యార్డులో బుధవారం 'అన్నదాత సుఖీభవ' 'PM కిసాన్' నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా MLA రోషన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎడ్ల బండిని నడిపి కూటమి శ్రేణులను ఉత్సాహపరిచారు. అనంతరం అర్హులైన రైతులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.