స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపు

ఢిల్లీలోని కొన్ని పాఠశాలలకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇది వరుసగా నాలుగో రోజు. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు, పాఠశాలలను తనిఖీ చేసి, విద్యార్థులను, సిబ్బందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.