ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీ విద్యాలయం ఇన్‌ఛార్ట్

VZM: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిని శుక్రవారం ఎల్.కోట క్యాంపు కార్యాలయంలో బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయ ఇన్‌ఛార్ట్ శైలజ మర్యాదపూర్వకంగా కలిసి ఆమెకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాఖీ కట్టి సోదర, సోదరీ భావం తెలియజేశారు. రాఖీ పండగ ముఖ్య ఉద్దేశం తెలుపుతూ సోదర సోదరీమణుల బంధం, భగవంతుని ప్రేమ, రక్షణ ఆధ్యాత్మిక విలువలు వివరించారు.