VIDEO: సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

E.G: సైబర్ నేరాల నివారణ పై విద్యార్థులు ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అనపర్తి ఎస్సై శ్రీను నాయక్ అన్నారు. అనపర్తి లోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు శనివారం సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెసేజ్ రూపంలో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయకూడదన్నారు. ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదన్నారు.