శిశు విక్రయాలపై విస్తృతంగా అవగాహన సదస్సులు
NLG: నేరేడుగొమ్ము మండలం కాచరాజుపల్లి పరిధిలో ఐసీడీఎస్ సూపర్వైజర్ శోభ ఆధ్వర్యంలో గురువారం శిశు విక్రయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలకు శిశు విక్రయాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. శిశు విక్రయాలు చట్టరీత్యా నేరమని, పట్టిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలని పోషించలేని స్థితిలో ఉంటే తమకు సమాచారం అందించాలని ఆమె సూచించారు.