అద్వానంగా మారిన తుని-నర్సీపట్నం రహదారి

అద్వానంగా మారిన తుని-నర్సీపట్నం రహదారి

KKD: కోటనందూరు మండలం కాకరాపల్లి శివారులోని తుని-నర్సీపట్నం రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని ప్రయాణికులు ఆరోపించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రోడ్డు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు వాపోయారు. రహదారి మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాలు తరచుగా మరమ్మతులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు