ఎలక్ట్రానిక్ మీడియా సంఘం ఉపాధ్యక్షుడు ఎంపిక
E.G: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజమండ్రి జర్నలిస్టు మండేల శ్రీరామ్మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన సంఘ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నాలుగు దశాబ్దాలుగా మీడియా రంగంలో సేవలందిస్తున్న ఆయన రానున్న రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.