'ఓర్పు, సమయపాలన తప్పనిసరి'
ASR: రెవిన్యూ శాఖ విధి నిర్వహణలో ఓర్పు, సమయపాలన తప్పనిసరని కలెక్టర్ టీ.నిశాంతి గురువారం పేర్కొన్నారు. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా, సిబ్బంది అందరూ ఖచ్చితమైన సమయపాలన పాటించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాఖ పరమైన సమస్యలను ఒక్కొక్కటిగా త్వరితగతిన పరిష్కరించాలన్నారు.