ఎస్పీ కార్యాలయంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం
KDP: కడప పోలీస్ కార్యాలయంలో శుక్రవారం వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరై, పోలీస్ DPO సిబ్బందితో కలిసి జాతీయత భావంతో వందేమాతరం ఆలపించారు. ఈ కార్యక్రమం జాతీయ ఐక్యతకు దోహదపడి, సిబ్బందిలో దేశభక్తి భావాలను మరింత పెంపొందించింది. అనంతరం “భారత్ మాతాకీ జై” అంటూ నినాదాలు చేశారు.