మండుటెండలో నిండుకుండలా చెరువు.. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
BHNG: యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామంలో చెరువు నిండి అలుగు పోస్తుండటంతో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చెరువుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేయడంతో మల్లాపూర్ చెరువు జలకళతో కళకళలాడుతుండగా గ్రామ ప్రజలతో కలిసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిలో అందరూ కృషి చేయాలని అన్నారు.