VIDEO: రాజన్నను దర్శించుకున్న దేవాదాయ శాఖ అధికారులు

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని శుక్రవారం దేవాదాయ శాఖ అధికారులు దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్లు డి.కృష్ణప్రసాద్, టంకశాల వెంకటేష్ అసిస్టెంట్ కమిషనర్ చంద్ర శేఖర్‌లు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు అధికారులకు వేదోక్త ఆశీర్వచనం చేశారు.