20 లక్షల చేప పిల్లలు వదిలిన ఎమ్మెల్యే

20 లక్షల చేప పిల్లలు వదిలిన ఎమ్మెల్యే

KRNL: గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె (దామోదర్ సంజీవయ్య) ప్రాజెక్టు వద్ద ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మిగనూర్ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ నాగేశ్వరరెడ్డి, మత్స్యశాఖ అధికారి డీడీ రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రాజెక్టులోకి 20 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, మండల కన్వీనర్ తిరుపతయ్య పాల్గొన్నారు.