వేలంపాటను రద్దు చేసిన అధికారులు
AKP: అచ్యుతాపురం మండలం మోసయ్యపేట పంచాయతీలో జరగాల్సిన వారపు సంత వేలంపాటను చివరి నిమిషంలో అధికారులు రద్దు చేశారు. దీంతో భారీగా హాజరైన కాంట్రాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పై అధికారుల ఆదేశాల మేరకే రద్దు చేసినట్లు కార్యదర్శి ఎస్. శ్రీను తెలిపారు. ముందస్తు సమాచారం లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.