VIDEO: లారీ ఢీ.. ఒకరు మృతి, ఒకరి గాయాలు

VIDEO: లారీ ఢీ.. ఒకరు మృతి, ఒకరి గాయాలు

HNK: హసన్ పర్తి మండలం వంగపహాడ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. ఇసుక ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో బొమ్మెర గ్రామానికి చెందిన డ్రైవర్ సోమయ్య మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.