కార్యకర్తలను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం
PPM: జియ్యమ్మవలస, జోగిరాజు పేట గ్రామాల్లోని వైసీపీ కార్యకర్తల కుటుంబాలను మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.