VIDEO: వాగుపాలవుతున్న సాగునీరు
GDWL: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఐజ మండలం నాగర్ దొడ్డి రిజర్వాయర్ ప్రధాన కాలువల్లో తలెత్తిన లీకేజీలను పరిశీలించిన రైతులు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. కళ్ల ముందే సాగునీరు వృథా అవుతున్నా పట్టించుకోకపోవడం అన్యాయమని, పొలాలు ఎండిపోతున్న తరుణంలో ఈ నీటిని పొలాలకు మళ్లించేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.