అన్ని వసతులతో నూతన కోర్టు భవన సముదాయాలు
SRCL: కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని వసతులతో, నూతన కోర్టు భవన సముదాయాలు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్ తెలిపారు. సిరిసిల్ల 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.81 కోట్ల 60 లక్షల తో 12 రకాల న్యాయస్థానాలు సెల్లార్‌తో పాటు టెన్ ప్లస్ టు శైలిలో నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.