నేటి నుంచి రంగనాయక స్వామి దర్శనానికి అనుమతి

నేటి నుంచి రంగనాయక స్వామి దర్శనానికి అనుమతి

ప్రకాశం: రాచర్ల‌లోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన రంగనాయక స్వామి దర్శనానికి శనివారం నుంచి అనుమతులు ఇస్తున్నట్లు ఆలయ ఈవో ఎం నాగయ్య తెలిపారు. గత 5 రోజులుగా భారీ వర్షాలకు గుండ్లకమ్మ పొంగి పొల్లడంతో అనుమతులు నిలిపివేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం నదిలో వరద ఉధృతి తగ్గడంతో భక్తులను అనుమతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.