VIDEO: 'ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలి'

MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట వద్ద నిర్మిస్తున్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలోకి భారీగా వరద నీరు చేరింది. 765 డీజీ మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఈ అండర్ పాస్ లోకి వర్షపు నీరు చేరి జలపాతంగా మారింది. దీనితో అండర్ పాస్ నిర్మాణాన్ని రద్దు చేసిఫ్లై ఓవర్ నిర్మించాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు బుధవారం డిమాండ్ చేశారు.