వీరభద్రస్వామి జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష
MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రస్వామివారిని ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి నుంచి ప్రారంభం కానున్న జాతరను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఆయన సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.