'అది పింక్ డైమండ్ కాదు.. కెంపు రాయి'

AP: తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజు సమర్పించినది పింక్ డైమండ్ కాదని, అది కేవలం కెంపు రాయి మాత్రమేనని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. ఆ హారంలో కొన్ని రూబీలు, కొన్ని రత్నాలు మాత్రమే ఉన్నాయని సమాచారం. పింక్ డైమండ్ ప్రచారం అబద్ధమని ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి పలు ఆధారాలతో నిరూపించారు.