'పట్టుదలతో విద్యను అభ్యసించాలి'

'పట్టుదలతో విద్యను అభ్యసించాలి'

HNK: దామెర మండల కేంద్రంలోని ఆశ్రమ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ చాహత్ బాజ్ పేయి ఇవాళ తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా ఆమె వంట గదితో పాటు స్టోర్ రూమ్‌ను తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఆర్టీవో నారాయణ, సంబంధిత అధికారులు ఉన్నారు.