గగన్‌యాత్రలో ఇస్రో మరో ముందడుగు..!

గగన్‌యాత్రలో ఇస్రో మరో ముందడుగు..!

గగన్‌యాన్ యాత్రలో ఇస్రో మరో ముందడుగు వేసింది. LVM3 రాకెట్‌ను నడిపించే CE20 క్రయోజెనిక్ ఇంజిన్‌ను కొత్త 'బూట్‌స్ట్రాప్ మోడ్'లో విజయవంతంగా పరీక్షించి, స్టార్ట్ చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ విధానం ద్వారా రాకెట్ బరువు తగ్గి, వాహక సామర్థ్యం పెరుగుతుందని పేర్కొంది. ముఖ్యంగా, మనుషుల్ని అంతరిక్షంలోకి పంపే ప్రయోగాలకు ఇది ఎంతో కీలకం కానుంది.