రాజుల చెరువు అభివృద్ధికి సుడా నిధులు: రవికుమార్

SKLM: నరసన్నపేటలోని రాజుల చెరువును సుడా నిధుల ద్వారా అభివృద్ధి చేస్తామని ఛైర్మన్ కె. రవికుమార్ తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి చెరువును పరిశీలించిన ఆయన, అభివృద్ధికి తన పూర్తి సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కూడా సుడా నిధులతో అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంఛార్జ్ బలగ ప్రవీణ్ కూడా పాల్గొన్నారు.