మండుతున్న ఎండలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
SRPT: జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. వీలైనంత వరకు ఎండలో బయటకు వెళ్లకుండా ఉండడం మంచిది. ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే తలకు క్యాప్, గొడుగు వంటివి వాడాలి. రోజుకు కనీసం 3-5 లీటర్ల నీరు తాగాలి. కాటన్ దుస్తులు ధరించడం, నూనె పదార్థాల వాడకం తగ్గించడం, కొబ్బరి బోండా, మజ్జిగ తాగడం చాలా మంచిది.