మహిళా CIకి బెదిరింపులు.. CPకి ఫిర్యాదు
NZB: భారీగా డబ్బులు ఇవ్వాలని, లేకుంటే ACBకి ఫిర్యాదు చేస్తానంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై NZB ఎక్సైజ్ CI స్వప్న CP సాయిచైతన్యకు నిన్న సాయంత్రం ఫిర్యాదు చేశారు. తెలంగాణ కల్లుగీత వృత్తి సంఘం అధ్యక్షుడిగా చెప్పుకొనే దానయ్యగౌడ్ అనే వ్యక్తి పలుమార్లు ఫోన్ చేసి తనకు డబ్బులివ్వాలని, లేకుంటే ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తున్నాడని అన్నారు.