'పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం'
MDK: స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. నియమ నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలని సూచించారు.