VIDEO: పోలీసు దాడులు.. గంజాయి స్వాధీనం..!
ఏలూరు: జిల్లా ఆపరేషన్ వజ్ర పహార్ కార్యక్రమంలో భాగంగా 598 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ ఘటనలో జంగారెడ్డిగూడెం నుంచి అశ్వరావుపేట వెళుతున్న వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామన్నారు. సుమారు రూ.3.14 కోట్లు ఉంటుందని అంచన వెసినట్లు తెలిపారు.