తాండూరులో చిన్న, పెద్ద తేడా లేకుండా హోలీ వేడుకలు

వికారాబాద్ల: తాండూరులో హోళీ సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రజలంతా వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. యువతి యువకులు రంగులతో తడిసి ముద్దయ్యారు. ముఖ్యంగా చిన్నారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. చిన్నారులు హొలీ శుభాకాంక్షలు తెలిపారు.