ఉమ్మడి జిల్లా బీసీ రాజ్యాధికార సభ

KNR: కరీంనగర్ పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లా బీసీ రాజ్యాధికార సభను ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవిలు మాట్లాడుతూ.. గత 75 ఏళ్లుగా బీసీలు నష్టపోతున్నారని, ఇకనైనా మేల్కొని వారి హక్కులను సాధించుకునే దిశగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.