VIDEO: చిన్నారికి స్క్రబ్ టైఫస్
VZM: బొండపల్లి మండలం మరువాడకి చెందిన నాలుగేళ్ల చిన్నారి నీలం కాన్వీ ప్రియ స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడింది. జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో విజయనగరం ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించామని.. టెస్టులలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్లు తండ్రి నాగరాజు చెప్పారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.