డిజిటల్ అరెస్ట్ అని బెదిరిస్తే ఎవరూ భయపడవద్దు: ఎస్పీ

డిజిటల్ అరెస్ట్ అని బెదిరిస్తే ఎవరూ భయపడవద్దు: ఎస్పీ

KKD: డిజిటల్ అరెస్ట్ అని బెదిరిస్తే ఎవరూ భయపడవద్దు అంటూ ఎస్పీ బిందు మాధవ్ ఓ ప్రకటన ద్వారా జిల్లా ప్రజలకు సోమవారం అవగాహన కల్పించారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ లేదని అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీస్, ఈడీ, ఐటీ అధికారులు వీడియో కాల్స్‌లో విచారణ చెయ్యరని సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.