పేకాట గ్యాంగ్‌పై పోలీసుల దాడి 10 మంది అరెస్ట్

పేకాట గ్యాంగ్‌పై పోలీసుల దాడి  10 మంది అరెస్ట్

KRNL: మంత్రాలయం సీఐ రామానుజులు ఆధ్వర్యంలో మాధవరం ఎస్సై విజయ్ కుమార్ సిబ్బందితో కలిసి ఇవాళ సింగరాజనహళ్లి గ్రామం వెలుపల ఖాళీ స్థలంలో పేకాట జూదం ఆడుతున్న గ్యాంగ్‌పై దాడి చేశారు. అందర్-బహార్ ఆటలో పాల్గొంటున్న 10 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,41,000 నగదు, 52 పేకముక్కలు, 6 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.