ఇకపై రైళ్లలో ప్రీ- వెడ్డింగ్ షూట్స్
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ- మీరట్ కారిడార్‌లోని నమో భారత్ రైళ్లు, వాటి స్టేషన్‌లలో పార్టీలు, ప్రీ- వెడ్డింగ్ ఫొటోషూట్‌లు వంటి వాటికి బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. నమో భారత్ రైలును గంటకు రూ.5 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఉ.6 నుంచి రా.11 గంటల వరకు బుకింగ్ అందుబాటులో ఉంటుంది.