చిన్నారికి విషమిచ్చి తండ్రి ఆత్మహత్యాయత్నం
BHNG: సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మ గూడెంకు చెందిన రవి, భార్యతో గొడవల వల్ల మనస్తాపం చెంది తన మూడేళ్ల కుమార్తెకు సపోటా పండులో ఎలుకల మందు కలిపి పాపకు ఇచ్చి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో చికిత్స పొందుతూ కుమార్తె మృతి చెందగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. రవి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.