అకాల వర్షంతో తడిసిన ధాన్యం

MHBD: మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఈరోజు పడిన అకాల వర్షంతో దాన్యం తడిచింది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు అవస్థలు పడుతున్నారు. మ్యాచర్ వచ్చినా అధికారులు టోకెన్ ఇవ్వడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు కోరుతున్నారు.