రేపల్లెలో తాగునీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం
బాపట్ల జిల్లా రేపల్లె మండలం చెన్నుపల్లివారిపాలెంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు పైప్‌లైన్ పనులను టీడీపీ నేత అనగాని శివప్రసాద్ ప్రారంభించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.