నిజాలు తెలుస్తాయనే భయంతోనే సుప్రీంకోర్టుకు: చంద్రబాబు
AP: తిరుమల లడ్డు వివాదంపై వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. తాము చేసిన తప్పులపై మాట్లాడొద్దంటూ వైసీపీ నేతలు కోర్టుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు నిజాలు తెలుస్తాయనే భయంతోనే ఇలా చేస్తున్నారని చెప్పారు. తిరుమల లడ్డూపై ఎవరూ మాట్లాడకూడదని కోర్టుకు వెళ్లారని తెలిపారు. వివేకా హత్య ఘటనపై చెల్లెలు సునితారెడ్డిని జగన్ మోసం చేశారని మండిపడ్డారు.