VIDEO: రామకృష్ణాపురంలో ఉద్రిక్తత.. ఇరువర్గాల దాడులు
KMM: చింతకాని మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో ఓట్ల కౌంటింగ్ జరుగుతుండగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలు కర్రలు, రాడ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన ఐదుగురికి (ఇద్దరి చేతులకు, ముగ్గురి కాళ్లకు) తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.