బాబు జగ్జీవన్ రామ్ సేవలు స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే
CTR: స్వతంత్ర భారతదేశంలో బాబు జగ్జీవన్ రామ్ అత్యుత్తమ పార్లమెంటేరియన్ అని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.