లిక్కర్ పాలసీ కేసుపై నేడు కీలక విచారణ

లిక్కర్ పాలసీ కేసుపై నేడు కీలక విచారణ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుపై ఇవాళ కీలక విచారణ జరగనుంది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. ఫిబ్రవరి 27న కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా 23 మందిని రౌస్ అవెన్యూ కోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది. 23 మందికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ తీర్పు చట్టవిరుద్ధం అంటూ సీబీఐ వాదిస్తోంది.