VIDEO: చాపరాయిలో ఒంటిగంట వరకే ప్రవేశం

ASR:డుంబ్రిగూడ మండలంలోని ప్రముఖ పర్యటక కేంద్రమైన చాపరాయి జలపాతం వద్ద ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పర్యటకులకు ప్రవేశం ఉంటుందని బుధవారం సిబ్బంది తెలిపారు. జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకేనని, ఆ తర్వాత అనుమతి లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పర్యాటకులు గమనించాలని కోరారు.