గురువాజిపేటలో పోషణ పక్వాడా వేడుకలు

గురువాజిపేటలో పోషణ పక్వాడా వేడుకలు

ప్రకాశం: కనిగిరి మండలం గురువాజిపేట అంగన్వాడీ కేంద్రంలో '8వ పోషణ పక్వాడా-2026' పక్షోత్సవాలు ఐసీడీఎస్ సూపర్వైజర్ పార్వతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే పోషకాహారం వల్ల ఆరోగ్యవంతమైన శిశువు పుడుతుందని తెలిపారు. సాంప్రదాయ ఆహారాన్ని తీసుకోవాలని, పిల్లలను మొబైల్, టీవీలకు దూరంగా ఉంచాలని సూచించారు.