VIDEO: పురుడు పోసిన 108 సిబ్బంది తల్లి బిడ్డ క్షేమం
WGL: రాయపర్తి మండలం కోలన్ పల్లి చెందిన జోగు నవ్య శుక్రవారం పురిటి నొప్పులతో బాధపడుతూ 108 సేవలకు సమాచారం అందించారు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు తీవ్రతరం కావడంతో కొండూరు గ్రామ శివారు ఈఎంటి శ్రీకాంత్, పైలట్ రామకృష్ణ ఆమెకు వాహనంలోనే పురుడు పోశారు. ఆమె ఆరోగ్యంగా ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి-బిడ్డను వర్ధన్నపేట ప్రభుత్వ తరలించారు.