లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్
నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ అరుణపై పోలీసులు పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు. ఆమెతోపాటు మరో ఇద్దరు రౌడీ షీటర్లపై ఇదే చట్టం కింద కేసులు నమోదు చేసి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కడప జైలుకి తరలించారు. గత ప్రభుత్వ హయాంలో అరుణ అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఆమెపై కోవూరు, నవాబుపేట, వేదాయపాలెం పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయి.