రామంతాపూర్ ఘటన.. ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే ?

HYD: రామంతాపూర్ గోకుల్ నగర్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో కరెంట్ షాక్‌తో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు వివరాలు వెల్లడించారు. 'అందరూ ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తుండగా ఒక్కసారి కరెంట్ తీగలపై నిప్పులు రేగాయి. ఒక్కొక్కరుగా అందరూ కింద పడిపోయారు. మాకు అప్పుడు అర్థం అయింది కరెంట్ షాక్ తగిలింది అని. వెహికిల్ రావడానికి కూడా సమయం పట్టింది. త్వరగా వస్తే బ్రతికేవారేమో అని వారు తెలిపారు.